HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌ బ్రో 'ట్రైలర్‌' వచ్చేసింది

పవన్‌ కళ్యాణ్‌ బ్రో ‘ట్రైలర్‌’ వచ్చేసింది

BRO Trailer
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ – సాయితేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. మామ అల్లుడు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మొదటి నుండి మంచి మంచి అంచనాలు ఉన్నాయి. తమిళంలో కొంతకాలం క్రితం హిట్ కొట్టిన ‘వినోదయా సితం’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి తమిళంలో సముద్రఖని దర్శకుడు వహించాడు. తెలుగులో కూడా ఈ డైరెక్షన్‌ చేశాడు.

తెలుగు నెటివిటీకి తగినట్టుగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను మార్చడం జరిగింది. అలాగే ఆయనే ఈ సినిమాకి సంభాషణలు సమకూర్చాడు. ఈ కారణంగా కూడా ఈ సినిమా మరింత క్రేజ్ ను సంతరించుకుంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రొమాన్స్, యాక్షన్, ఎమోషన్, కామెడీ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తనకి టైమ్ లేదు .. టైమ్ లేదు అంటూ హడావిడి చేసే తేజు పాత్ర హఠాత్తుగా చనిపోవడం .. ఆ టైమ్‌లో అతనితో మిగతా డ్రామా నడిపించే దైవశక్తిగా పవన్ ఎంట్రీ ఇవ్వడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.

ఒక్క ట్రైలర్ తోనే పాత్రలు .. వాటి స్వభావాలు .. కథ అర్థమయ్యేలా చేయడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. బ్రహ్మానందం కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ప్రియా ప్రకాశ్ వారియర్ – కేతిక శర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ ట్రైలర్‌ మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu