HomeTelugu Big Stories'భోళా శంకర్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘భోళా శంకర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Chiranjeevi bhola shankar m
మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ త‌ర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘భోళా శంక‌ర్’ ఒక‌టి. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా మేక‌ర్స్ బిగ్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు.

సోమ‌వారం చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘భోళా శంక‌ర్’ మేక‌ర్స్ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్ర‌క‌టించారు. భోళా శంక‌ర్ సినిమాను వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఎప్రిల్ 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఓపోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చేతిలో త్రిషూలం లాకెట్‌తో ఉన్న చైన్‌ను తిప్పుతూ కూలింగ్ గ్లాసెస్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ న‌టిస్తుంది. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్, క్రియేటీవ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu