HomeTelugu Big Storiesఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణం:చిరంజీవి

ఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణం:చిరంజీవి

Chiranjeevi meeting with fa
ఈరోజు (ఆదివారం) క‌రోనా క్రైసిస్‌లో ఆక్సిజ‌న్ బ్యాంక్ సేవ‌లందించిన మెగా అభిమానుల‌కు మెగాస్టార్‌ చిరంజీవి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రంలో తెలంగాణలోని అభిమానులతో చిరంజీవి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘కరోనాతో అభిమానుల్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆక్సిజన్‌ కొరతతో గొల్లపల్లిలో చాలా మంది చనిపోయారు. ఆ ఘటనతోనే ఆక్సిజన్‌ బ్యాంకు ఆలోచన వచ్చింది. దుబాయ్‌, గుజరాత్‌, వైజాగ్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లు తెప్పించాం. రెండో దశలో 3వేలకు పైగా సిలిండర్లు తయారు చేయించాం. ఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణం’ అని చిరంజీవి ప్రశంసించారు. వచ్చేవారం ఏపీ అభిమాన సంఘాలతో చిరంజీవి సమావేశం కానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu