HomeTelugu Newsమరోసారి మాస్టార్‌గా చిరంజీవి

మరోసారి మాస్టార్‌గా చిరంజీవి

14a

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి మాస్టర్‌ అవతారం ఎత్తబోతున్నారా? అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. 1997లో వచ్చిన ‘మాస్టర్’లో చిరు ‘మాస్టారూ.. మాస్టారూ మంచి లెక్చర్ ఇచ్చారూ..’ అంటూ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నారు. ‘ఠాగూర్‌’లోనూ ప్రొఫెసర్‌గా సందడి చేశారు. కాగా ఇప్పుడు మరోసారి అదే పాత్రతో క్లాస్‌రూమ్‌లో అడుగుపెట్టబోతున్నారని సమాచారం. అయితే ఈసారి ఎలాంటి పాఠాలు చెప్పబోతున్నారనేది దర్శకుడు కొరటాల శివ చెప్పాల్సిందే. ఆయన దర్శకత్వం వహించబోయే చిత్రంలో చిరు మాస్టర్‌గా సందడి చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో కొంతసేపు మాస్టర్‌గా ఆయన విద్యాబోధన చేస్తూ కనిపిస్తారని టాక్‌. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

14

త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి పలు టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. ‘గోవింద్ ఆచార్య’, ‘గోవింద.. హరి గోవిందా’ అనే పేర్లు వినిపిస్తున్నాయి. చిరు సరసన హీరోయిన్‌గా త్రిష నటించబోతున్నారట. ఈ చిత్రం కోసం చిరు ఇంకా ఫిట్‌గా తయారవుతున్నారట. అందుకోసం ఇప్పటికే ప్రత్యేక నిపుణుల సమక్షంలో కసరత్తులు మొదలుపెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu