HomeTelugu Big Storiesతోడ బుట్టిన బ్రదర్స్ కి, బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే: చిరంజీవి

తోడ బుట్టిన బ్రదర్స్ కి, బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే: చిరంజీవి

Chiranjeevi shares an adora

ఈ రోజు (మే 24) అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు అందరూ తమ అన్నాదమ్ముల పట్ల ఉన్న ప్రేమ చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే సందర్భంగా మెగా బ్రదర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన సోదరులు నాగబాబు,పవన్ కళ్యాణ్ లతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన చిరంజీవి.. ‘తోడ బుట్టిన బ్రదర్స్ కి రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ఫొటో షేర్‌ చేసిన కొద్దిసేపట్లోనే అభిమానులు లైకులు రీట్వీట్లుతో వైరల్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu