HomeTelugu Big Storiesక్షమపణలు కోరిన విజయ్‌ సేతుపతి

క్షమపణలు కోరిన విజయ్‌ సేతుపతి

Controversy on vijay sethup
తమిళ నటుడు విజయ్ సేతుపతి నేడు (జనవరి 16) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్ సేతుపతి సెట్‌లోనే బర్త్‌డే కేక్ కట్ చేశాడు. అయితే.. ఆ కేక్‌ను ఓ ఖడ్గంతో కట్ చేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆ ఫొటో వైరల్ కావడంతో.. కొందరు నెటిజన్లు విజయ్ చర్యను తప్పుబట్టారు. గూండాల మాదిరిగా ఖడ్గంతో పుట్టినరోజు కేక్‌ను కట్ చేయడమేంటని సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి.. కేక్‌ను అలా కట్ చేసినందుకు క్షమాపణ చెప్పాడు. అలా కట్ చేయడం వెనకున్న కారణాన్ని కూడా వివరించాడు.

ప్రస్తుతం తను నటిస్తున్న ‘పొన్రం’ సినిమాలో ‘ఖడ్గం’ కీలక పాత్ర పోషించనుందని.. అందువల్లే ఆ ‘ఖడ్గం’తో బర్త్ డే కేక్‌ను కట్ చేశానని సేతుపతి తన ట్విట్టర్‌లో వివరణ ఇచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం ‘పొన్రం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ సెట్‌లోనే ఈ ఘటన జరిగింది. బేషజాలకు పోకుండా విజయ్ సేతుపతి హుందాగా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu