HomeTelugu Newsడిసంబర్ 30న 'ఎంతవరకు ఈ ప్రేమ'!

డిసంబర్ 30న ‘ఎంతవరకు ఈ ప్రేమ’!

‘రంగం’ సూపర్ హిట్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ ‘కావలై వేండాం’ తెలుగులో ‘ఎంత‌వ‌ర‌కు ఈ ప్రేమ‌’ టైటిల్ తో డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ అందిస్తున్నారు. ‘యామిరుక్క బ‌య‌మేన్‌’ ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హిస్తున్నారు. సెన్సార్ కంప్లీట్ చెసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈనెల 30న  ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.
 
ఈ సంద‌ర్భంగా  డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. “రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాట‌ల‌కు  యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ముఖ్యంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ పై చిత్రీక‌రించిన  గ్లామ‌ర్ స‌న్నివేశాలు యూత్ ను వీప‌రీతంగా  ఆక‌ట్టుకుంటాయి. ఇప్ప‌టికే ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాతో ఆ ఫాలోయింగ్ మ‌రింత రెట్టింపు అవుతుంది.  ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకోవ‌డం కోసం ట‌ఫ్ పోటీ ఎదురైన‌ప్ప‌టికీ ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. తమిళ్ తో పాటు తెలుగులో సైతం ఒకెసారి విడుదల చెయాలనుకున్నా,  సమయానికి తెలుగు  సెన్సార్ అవ్వక పోవటంతొ తెలుగు వెర్షన్ రిలీజ్ లేటయింది.   ఈ రోజు సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.  డిసెంబ‌ర్ 30న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చెస్తున్నాము.  ‘రంగం’ చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మించటం విశేషమని” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu