HomeTelugu News'ఎఫ్2' సీక్వెల్ ఎఫ్3 త్వరలో

‘ఎఫ్2’ సీక్వెల్ ఎఫ్3 త్వరలో

9 14విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు నటించిన ‘ఎఫ్2’ సినిమా సంక్రాంతి స్పెషల్ గా వచ్చి హిట్ కొట్టింది. అంచనాలకు మించి ఈ సినిమా హిట్ కావడంతో.. చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి తరువాత కూడా సినిమాకు కలెక్షన్లు వస్తుండటం విశేషం.

సినిమా హిట్ కావడంతో.. శుక్రవారం సాయంత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. హిట్ అవుతుంది అనుకున్నామని.. ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఊహించలేదని దర్శక నిర్మాతలు చెప్పడం విశేషం. సినిమా చివర్లో ఎఫ్3 త్వరలో అని వేశారు. అంటే దీని అర్ధం ఎఫ్2 సినిమాకు సీక్వెల్ ఉంటుందనే కదా. ఈ విషయాన్ని దర్శకుడు కూడా చెప్పడంతో.. తప్పకుండా త్వరలోనే ఎఫ్ 3 సినిమాను తెరపై చూడొచ్చన్నమాట. మరి ఈ సినిమాలో హీరోగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఉంటారా లేదంటే మరొకరిని తీసుకుంటారో చూద్దాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu