HomeTelugu Big Storiesఎఫ్ 3 : 'లైఫ్ అంటే మినిమమ్ సాంగ్‌ విడుదల

ఎఫ్ 3 : ‘లైఫ్ అంటే మినిమమ్ సాంగ్‌ విడుదల

F3 movie life ante itta lyr

టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేశ్ -మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్ 3 ‘. దర్శకుడు అనిల్ రావిపూడి ఈసినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా .. వరుణ్ జోడీగా మెహ్రీన్ అలరించనున్నారు. ఒక ముఖ్యమైన పాత్రలో సోనాల్ చౌహాన్ అందాలు ఒలకబోయగా, స్పెషల్ సాంగ్ లో పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పూజ హెగ్డే .. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు.

‘లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా .. ‘ అంటూ ఈ పాట సాగుతోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చగా, రాహుల్ సిప్లి గంజ్ .. గీతామాధురి ఆలపించారు. ఈ పాటకి రాజు సుందరం కొరియో గ్రఫీని అందించాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu