HomeTelugu Big Storiesమహేష్‌ మేనల్లుడు 'హీరో' టైటిల్‌ టీజర్‌

మహేష్‌ మేనల్లుడు ‘హీరో’ టైటిల్‌ టీజర్‌

HERO Telugu Movie Title Tea
సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు.. ఏంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించిన మహేష్ బాబు.. సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ‘అశోక్ నీ ఫస్ట్ సినిమా టైటిల్ ను లాంచ్ చేయడం కంటే సంతోషమైనది లేదు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. #HERO ప్రయాణం ప్రారంభమవుతుంది” అని ట్వీట్ చేసిన మహేష్ చిత్ర బృందానికి విషెస్ అందించారు.

ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అశోక్‌ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, కౌశల్యా, వెన్నెల కిశోర్, సత్య, అర్చన సౌందర్య, మైమ్ గోపి, అజయ్ ప్రభాకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu