HomeTelugu Big StoriesChiranjeevi : చిరంజీవితో బాలయ్య బ్యూటీ?

Chiranjeevi : చిరంజీవితో బాలయ్య బ్యూటీ?

Honey Rose in chiranjeevi VChiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసార డైరెక్టర్‌ వశిష్ట దర్శకత్వంలో వస్తున్నీ భారీ సోషియో ఫాంటసీ సినిమా గురించి రోజుకో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది. ‘విశ్వంభర’ లో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్‌ కనిపించబోతున్నారని, అందులో ఒక హీరోయిన్‌ గా హనీ రోజ్ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్‌.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ హనీ రోజ్‌. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆమె గ్లామర్‌ ఈ సినిమాకి ప్లస్‌ అయింది అనే చెప్పాలి.

ఇక ఈవెంట్‌ల్లోని ఈ అమ్మడు హాల్‌చల్‌ చేసింది. ఇటీవలే హనీ రోజ్ తెలుగులో సినిమా చేయకపోయిన సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టింవ్‌గా ఉంటుంది. ఈమెకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది.

మలయాళంలో వరుసగా సినిమాలతో బిజీగా ఉంది హానీ రోజ్‌. వీర సింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాలో నటించే అవకాశంను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu