జోగి రమేష్ గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో జోగి పరిస్థితేంటి ?

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. జోగి రమేష్. ఏపీలో బలమైన నేతల్లో జోగి రమేష్ కూడా ఒకరు. ప్రస్తుతం ప్రజల్లో జోగి రమేష్ పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం లో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రమేష్ మచిలీపట్నం లోని జాతీయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. రమేష్ కుటుంబం తొలి నుంచి రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి జోగి మోహనరావు రాష్ట్ర బీసీ నాయకుడిగా ఉంటూనే కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులు అలంకరించారు. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం మండలాధ్యక్షుడిగా పనిచేశారు. పైగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ కు అత్యంత సన్నిహితులు. తండ్రి బాటలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన జోగి రమేష్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు.

అనంతరం, యూత్ కాంగ్రెస్ లో చేరి ఉమ్మడి కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. రైల్వే బోర్డు సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వైయస్ హయాంలో ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పెడన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరిన జోగి రమేష్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం మైలవరం లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయినప్పటికీ జగన్ ప్రాపకంతో రాజకీయంగా నిలబడ్డారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పెడన నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఇంతకీ రాజకీయ నాయకుడిగా జోగి రమేష్ గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో జోగి రమేష్ పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. జోగి రమేష్ మళ్లీ గెలిచే అవకాశం లేదు. దీనికితోడు అంబటి జోగి రమేష్ మీద ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

ముఖ్యంగా 2022లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జోగి రమేష్ కి మంత్రి పదవి వచ్చినప్పటికీ నుంచి ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారు. పలు ప్రభుత్వ భూములను పబ్లిక్ గానే కబ్జా చేశారు. వైఎస్ కుటుంబానికి అత్యంత వీర విధేయుడిగా ముద్ర పడ్డ జోగి రమేష్, ప్రస్తుతం తన సొంత సామాజిక వర్గమైన గౌడ సామాజిక వర్గం(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన బీసీ సామాజిక వర్గం) మీద పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఐతే, జోగి రమేష్ పై ఎవరికీ ఎలాంటి నమ్మకాలు లేవు. సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని ఎదిగాడు అనే అపవాదు సైతం జోగి రమేష్ పై పడింది. ఇక వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ మళ్లీ గెలిచే అవకాశం లేదు.

CLICK HERE!! For the aha Latest Updates