HomeTelugu Newsవ్యభిచారం కేసులో జబర్దస్త్ నటులు

వ్యభిచారం కేసులో జబర్దస్త్ నటులు

6 3
జబర్దస్త్ కామెడీ షోలోని ఇద్దరు నటులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్టణంలోని మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్నసమాచారం తో పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో జబర్దస్త్ కమెడియన్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. వీరితో పాటు వ్యభిచార గృహ నిర్వాహకులను, మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎయిర్‌పోర్టు పీఎస్‌లో విచారిస్తున్నట్టు సమాచారం. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పట్టుబడిన ఇద్దరు ఆర్టిస్టుల్లో దొరబాబు, పరదేశి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిరువురూ జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది టీమ్‌కు చెందిన వారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu