HomeTelugu Big Stories'జల్సా' మూవీ ట్రైలర్‌

‘జల్సా’ మూవీ ట్రైలర్‌

Jalsa Trailer

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా జల్సా సినిమాను భారీ ఎత్తున స్క్రీనింగ్ చేసేందుకు ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. దాదాపుగా 500 స్క్రీన్స్ ల్లో జల్సా సినిమాను చూడబోతున్నారు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ను ఆయన బర్త్ డే సందర్భంగా స్క్రీనింగ్ చేసిన విషయం తెల్సిందే. చిరంజీవి బర్త్ డే కి ఘరానా మొగుడు సినిమాను వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్ డే కి జల్సా ను అభిమానుల కోసం ప్రదర్శించబోతున్నారు.

జల్సా సినిమా ఫ్యాన్స్ షో కోసం ప్రత్యేకంగా ట్రైలర్ ను కూడా కట్ చేయించారు. గీతా ఆర్ట్స్ వారు ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. జల్సా ట్రైలర్ పూర్తిగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో సాగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu