HomeTelugu Big Storiesశ్రీదేవి బయోపిక్‌పై జాన్వీ స్పందన

శ్రీదేవి బయోపిక్‌పై జాన్వీ స్పందన

Janhvi talking about sridev
జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం ‘మిలీ’. నవంబర్‌ 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ.. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా శ్రీదేవి బయోపిక్‌పై స్పందించింది. ఇంటర్వ్యూలో భాగంగా శ్రీదేవి బయోపిక్ తెరకెక్కిస్తే అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నారా ? అని విలేకరి ప్రశ్నించగా.. దీనికి జాన్వీ వెంటనే లేదు అని సమాధానమిచ్చింది. ఇందుకు కారణం చెప్పాలని కోరగా.. ‘సమాధానం చాలా పెద్దగా ఉంటుంది.. ప్రస్తుతం నేను ఈ స్టేజిపై ఏడవాలనుకోవడం లేదు’ అని బదులిచ్చింది.

అనుకోని పరిస్థితుల్లో మైనస్‌ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కినచిత్రం ‘మిలీ’. మలయాళ చిత్రం ‘హెలెన్‌’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మించారు. సన్నీ కౌశల్‌, మనోజ్‌ పవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాతృకకు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్‌ ఈ సినిమాకు కూడా దర్శకత్వ వహించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu