HomeTelugu Newsజీవా, కాజల్ ల సినిమా తెలుగులోకి!

జీవా, కాజల్ ల సినిమా తెలుగులోకి!

జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ ‘కవలై వేండాం’. డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమిళం లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు హక్కులు కోసం చాలా మంది అతిరథులు పోటీ పడ్డప్పటికీ డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ ఫ్యాన్సీ ఆఫర్ తో హక్కులను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా…
నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. “రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. దాంతో తెలుగులో సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. త్వరలోనే తెలుగు టైటిల్ ను అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘రంగం’ చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మిస్తుండ‌టం విశేషం” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu