HomeTelugu Big StoriesGautham Tinnanuri: కొత్త నటీనటులతో 'జెర్సీ' దర్శకుడి కొత్త సినిమా

Gautham Tinnanuri: కొత్త నటీనటులతో ‘జెర్సీ’ దర్శకుడి కొత్త సినిమా

jersey fame gautham tinnanu

Gautham Tinnanuri: ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు గౌత‌మ్ తిన్న‌నూరి. నాని హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన మరో సినిమా చేయలేదు. అయితే గ‌త ఏడాది టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవరకొండతో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈమూవీ ఇప్ప‌టివ‌ర‌కు ప్రారంభం కాలేదు. ఒకవైపు విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మ‌రింత ఆలస్యం అవుతుంది. అయితే ఈ గ్యాప్‌లో గౌత‌మ్ తిన్న‌నూరి త‌న తాజా ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు .

గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్షన్‌లో వ‌చ్చే నెక్స్ట్ మూవీకి ‘మ్యాజిక్’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. దీంతో పాటుగా ఫ‌స్ట్ లుక్‌ని కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ సినిమా సంగీతం నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు ఫస్ట్‌లుక్‌ ద్వారా తెలుస్తుంది. కొత్త నటి నటులతో ఈ సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది.

సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ నిర్మిస్తుండ‌గా.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నున్నాడు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో 2024 స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. జెర్సీ వంటి స్పోర్ట్స్ డ్రామా సినిమాతో పాపులర్ అయిన గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu