HomeTelugu Big Storiesపెళ్లి తరువాత అటువంటి పాత్రలో కాజల్‌!

పెళ్లి తరువాత అటువంటి పాత్రలో కాజల్‌!

Kajal play prostitute role

పెళ్లి తరువాత కూడా వరుస ఆఫర్‌లతో దూసుకుపోతున్నారు ఈ తరం హీరోయిన్‌లు. టాలీవుడ్‌లో సమంత అక్కినేని పెళ్లి తర్వాత సంచలన పాత్రలు చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకెళ్తుండగా.. తాజాగా ఆ లిస్ట్‌లో కాజల్‌ అగర్వాల్‌ కూడా చేరింది. కాజల్ గతేడాది గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘ఇండియన్‌-2’ సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కాజల్ స్పై పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ పాత్ర వేశ్య కూడా అని తెలుస్తోంది.

నాగార్జున ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. సినిమాలో ఈమె ఎక్కువ భాగం వేశ్యగా.. చివర్లో మాత్రం స్పైగా కనిపించబోతుందట. తీవ్రవాదుల గుట్టు రట్టు చేయడానికి తన అందచందాలతో వాళ్లను ఆకట్టుకుంటూ.. వాళ్ళతో రొమాన్స్ చేస్తూ అక్కడి రహస్యాలను తన డిపార్ట్మెంట్ కు అందజేస్తుదంట. అంతే కాదు ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లో కూడా కాజల్‌ నటించబోతుందట. ఏదేమైనా.. పెళ్లి తర్వాత ఇలాంటి పాత్రలు చేయడం చిన్న విషయమేమి కాదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu