HomeTelugu Big Storiesపెళ్ళి తరువాత కాజల్‌ 'లైవ్ షో' సిరీస్‌ ట్రైలర్‌

పెళ్ళి తరువాత కాజల్‌ ‘లైవ్ షో’ సిరీస్‌ ట్రైలర్‌

Kajal live telecast to stre
ఓటీటీకి డిమాండ్‌ పెరగడంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు వ‌రుస‌గా డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్‌ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా చేరింది. కాజల్‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన వెబ్ సిరీస్‌.. లైవ్ టెలికాస్ట్. టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ఈ సిరీస్‌ తెరకెక్కించింది. కాజ‌ల్‌తో పాటు వైభ‌వ్, ఆనంది కీల‌క పాత్రలు పోషించారు. త‌మిళ దర్శకుడు వెంక‌ట్ ప్రభు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్ విడుదలైంది. ఇందులో కాజ‌ల్ టీవీ ఛానెల్ రిపోర్టర్ గా కనిపించనుంది. ఈ ట్రైల‌ర్ ఆస‌క్తికరంగా ఉంది. హారర్ కామెడీని ఇష్టపడేవారు మెచ్చేలా ఉంది. పెళ్ళి తర్వాత కాజల్ తో చేస్తున్న ఈ ‘లైవ్ షో’ సిరీస్‌తో అయినా ఆడియన్స్ ను మెప్పిస్తాడని భావిద్దాం. ఫిబ్ర‌వ‌రి 12న లైవ్ టెలికాస్ట్ స్ట్రీమింగ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu