HomeTelugu Big Storiesఅధికారంలోకి వస్తే మదురై రెండో రాజధాని: కమల్‌హాసన్‌

అధికారంలోకి వస్తే మదురై రెండో రాజధాని: కమల్‌హాసన్‌

Kamal haasan announced cont
కోలీవుడ్‌ నటుడు కమలహాసన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం పోటీ చేస్తుందని, తాను కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. మదురై పర్యటనతో తేని, దిండుగల్‌ వైపుగా ప్రచారానికి వెళ్తూ మీడియాతో కమల్‌ మాట్లాడారు. నిజాయితీ, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళతామని తెలిపారు. రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ సాధ్యమేనని, త్వరలో ఇందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు.

రజనీకాంత్‌ ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూద్దామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రజనీని తాను తప్పకుండా కలుస్తానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మార్పు నినాదంతో మక్కల్‌ నీది మయ్యం ముందుకు సాగుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే మదురై కేంద్రంగా రెండో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనుమతులు ఇవ్వడం లేదని పేర్కొంటూ, తాము చట్టానికి, నిబంధనలకు కట్టుబడి ప్రచారం చేసుకుంటున్నామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu