HomeTelugu NewsBigg Boss Kannada: అక్రమ దత్తత కేసులో నటి అరెస్ట్

Bigg Boss Kannada: అక్రమ దత్తత కేసులో నటి అరెస్ట్

Kannada Bigg Boss fame sonu srinivas gowda arrestedBigg Boss Kannada: క‌న్న‌డ బిగ్‏బాస్ ఫేమ్ సోను శ్రీనివాసగౌడను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర కర్ణాటకకు చెందిన 8 ఏళ్ల చిన్నారిని ఎలాంటి నియమాలు పాటించకుండా.. అక్రమంగా దత్తత తీసుకోవడమే కాకుండా దత్తత తీసుకునే రూల్స్‌ను ఆమె బ్రేక్ చేసిందని పోలీసులు తెలిపారు.

దత్తత రూల్స్‌ ప్రకారం, తాము ఎవరిని, ఎక్కడి నుంచి దత్తత తీసుకున్నామో బహిరంగ పరచకూడదు. అయితే సోను చిన్నారిని ద‌త్త‌త తీసుకున్న అనంత‌రం ఆ బాలికకు అన్నం పెడుతున్న వీడియోలు, త‌న‌తో ఉన్న వీడియోల‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది.

అలాగే ఈ చిన్నారిని ద‌త్త‌త తీసుకున్నాన‌ని.. మీరుకూడా దత్తత తీసుకోవాలంటూ పోస్టులు పెట్టింది. ఇక ఈ విష‌యంపై విప‌రీతంగా ట్రోల్స్ వ‌చ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోను శ్రీనివాస్ గౌడను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే పాపతో పని చేయించుకునేందుకు తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు దత్తత నియమాలు పాటించానని అన్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే దత్తత కార్యక్రమం జరిగిందని తెలిపింది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu