HomeTelugu Big Storiesభోళా శంకర్‌: తీను మార్‌ సాంగ్ విడుదల

భోళా శంకర్‌: తీను మార్‌ సాంగ్ విడుదల

Kottara Kottu Teenumaaru Ly
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఈ సినిమా ఆగష్టు 11న విడుదల కానుంది. ఈనేపథ్యంలో నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ఈమూవీపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటిస్తుండగా తమన్నా భాటియా హీరోయిన్‌గా కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా నుండి తీను మారు అనే సాంగ్‌ విడుదలైంది. మెగాస్టార్ తో కలిసి కీర్తి సురేష్ డ్యాన్స్ అదరగొట్టిన ఈ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడారు. ఈ వీడియో మథ్యలో షూటింగ్‌ షార్ట్స్‌ కూడా చూపించారు. ఈ సాంగ్‌ మొత్తం జోష్‌గా సాగింది.ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu