
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. నిన్ను కోరి, మజిలీ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఖుషి నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లతోపాటు రెండు పాటలు కూడా మంచి వ్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
కాగా మేకర్స్ ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ అప్‌డేట్ అందించారు. ఖుషి టైటిల్ సాంగ్‌ను జులై 28న లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేశారు. బ్లూ డ్రెస్‌లో ఛిల్ అవుట్ మూడ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ లుక్ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ టీం ఇప్పటికే ఖుషి నువ్ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే.. అంటూ సాగే ట్యూన్‌తో అదిరిపోయే మ్యూజికల్ అప్‌డేట్ అందించాడు.
ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.













