HomeTelugu News'లక్కున్నోడు' ఫస్ట్ లుక్!

‘లక్కున్నోడు’ ఫస్ట్ లుక్!

మంచు విష్ణు, హన్సిక మోత్వాని జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్కున్నోడు’.  ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ‘ల‌క్కున్నోడు’. సినిమా ప్ర‌స్తుతం ల‌క్కున్నోడు సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. ల‌వ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైనర్‌గా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు విష్ణు స‌రికొత్త లుక్‌తో క‌న‌ప‌డ‌నున్నాడు.  
తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు,  స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu