HomeTelugu Big Storiesనితిన్ మూవీ లిరికల్ వీడియోసాంగ్ రిలీజ్

నితిన్ మూవీ లిరికల్ వీడియోసాంగ్ రిలీజ్

Rangde movie song released
వెంకీ అట్లూరి దర్శకత్వంలో హీరో నితిన్‌ తాజా చిత్రం ‘రంగ్‌ దే’ తెరకెక్కుతోంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ‘‘నా కనులు ఎపుడు.. కననే కనని..’’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. అందమైన ఈ మెలోడీ సాంగ్ లిరికల్ వీడియో మహేహ్‌బాబు చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా రాక్‌ స్టార్‌, అమేజింగ్‌ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సింగర్‌ సిధ్‌ శ్రీరాం ఇద్దరినీ మహేష్‌బాబు పొగడ్తల్లో ముంచెత్తారు. డీఎస్‌పీ, సిద్‌ శ్రీరాం మంచి కాంబినేషన్‌ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సాంగ్ విడుదలైన కొద్దిసేపటికే భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలోని 2 పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu