HomeTelugu Big Storiesధమాకా: 'మాస్ రాజా' సాంగ్‌ విడుదల

ధమాకా: ‘మాస్ రాజా’ సాంగ్‌ విడుదల

Mass Raja Lyrical Song from
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’.. ‘డబుల్ ఇంపాక్ట్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాలో పెళ్లి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ధమాకా’ మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ – ‘జింతాక్’ సాంగ్ మంచి స్పందన వచ్చిందితెచ్చుకోగా.. తాజాగా ‘మాస్ రాజా’ అనే మరో పాటని విడుదల చేసారు.

ఈ మాస్ రాజా పాట ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ఎనర్జిటిక్ మాస్ స్టెప్‌లతో రవితేజ ఆకట్టుకుంటున్నాయి. సింగర్ నకాస్ అజిజ్ ఎంతో హుషారుగా ఆలపించారు. అంటూ రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు. యష్ మాస్టర్ ఈ మాస్ సాంగ్ కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu