HomeTelugu Big Storiesట్విటర్‌ అకౌంట్‌ పేరు మార్చేసిన చిరంజీవి..

ట్విటర్‌ అకౌంట్‌ పేరు మార్చేసిన చిరంజీవి..

Megastar Chiranjeevi change

మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత, సినిమా విషయాలను తెలియజేయడంతో పాటు ప్రతి పండగకు సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. అందుకే అతి తక్కువ సమయంలోనే ట్విటర్‌లో ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య 1.3 మిలియన్స్‌కి చేరింది.

ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి తన ట్విటర్‌ ఖాతా పేరును మార్చాడు. చిరంజీవి కొణిదెల అని ఉండే తన ట్విటర్‌ అకౌంట్‌ నేమ్‌ను ‘ఆచార్య’గా మార్చుకున్నాడు. ఆచార్య.. ఆయన నటించిన తాజాగా సినిమా పేరు. ఈ నెల 29న ఈ మూవీ థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తన ట్విటర్‌ ఖాతాకు ‘ఆచార్య’అని పేరు మారుస్తూ రామ్‌చరణ్‌కు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

మెగాస్టార్‌ చిరంజీవి స్వతహా ఆంజనేయస్వామి భక్తుడు. ఈరోజు హనుమాన్‌ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆ వీడియోను షేర్‌ చేశాడు. అందులో కాటేజీలో రామ్‌ చరణ్‌ మేకప్‌ వేసుకుంటుండగా, ఓ వానరం అక్కడకు వచ్చింది. చరణ్‌ మేకప్‌ వేసుకోవడం అయిపోగానే.. ఆ వానరానికి బిస్కెట్లు ఇచ్చాడు. అది సోఫాపైకి ఎక్కి చక్కగా బిస్కెట్లను తినింది. ఆ వీడియోకి ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ అనే స్లోకాన్ని నేపథ్య సంగీతంగా యాడ్‌ చేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu