HomeTelugu Big Storiesఎన్‌బీకే 107 టీజర్: భయం నా బయోడేటాలోనే లేదురా అంటున్న బాలయ్య

ఎన్‌బీకే 107 టీజర్: భయం నా బయోడేటాలోనే లేదురా అంటున్న బాలయ్య

NBK107 First Hunt Teaser
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించనుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో.. కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. గురువారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ హంట్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ‘మీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌.. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌, భయం నా బయోడేటాలోనే లేదు, నరకడం మొదలుపెడితే ఏ పార్ట్‌ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా..’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో అదరగొట్టాడు బాలయ్య. నెరిసిన గడ్డం, కొత్త హెయిర్‌ స్టైల్‌తో అదుర్స్‌ అనిపించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu