HomeTelugu Big Storiesరంగమార్తాండ: ఆకట్టుకుంటున్న.. చిరంజీవి షాయరీ

రంగమార్తాండ: ఆకట్టుకుంటున్న.. చిరంజీవి షాయరీ

chiranjeevi
కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ మూవీ ‘నట సామ్రాట్’ రీమేక్ ఈ చిత్రం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ, అలీ రెజా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

మన తల్లిదండ్రుల కథ అంటూ కృష్ణవంశీ ప్రచారం చేస్తున్న ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. మెగాస్టార్ ఈ సినిమా కోసం చెప్పిన షాయరీ బుధవారం విడుదలైంది. నేనొక నటుడ్ని’ అంటూ సాగే ఈ కవితను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్లో ప్రేక్షక హృదయాలకు హత్తుకునేలా చెప్పడం విశేషం. ఈ షాయరీని రచయిత లక్ష్మీ భూపాలందించగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా నేపథ్య సంగీతం అందించారు.

ఓ నటుడు పడే అవేదనకు అక్షర రూపం ఇచ్చి మెగాస్టార్ తో చెప్పించిన తీరు హార్ట్ టచింగ్ గా వుంది. గత కొన్ని నెలలుగా కృష్ణవంశీ ఓ తపస్సులా చేస్తూ వస్తున్న ‘రంగమార్తాండ’కు చిరంజీవి షాయరీ ప్రాణం పోయడమే కాకుండా ఈ చిత్ర కథకు అద్దంపడుతూ ఇందులోని రంగస్థల నటుడి భావోద్వేగాలని చక్కగా ఆవిష్కరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu