HomeTelugu Newsఅక్కినేని యంగ్‌హీరోల హీరోయిన్‌ అందాల విందు

అక్కినేని యంగ్‌హీరోల హీరోయిన్‌ అందాల విందు

హీరోయిన్‌ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో అక్కినేని యంగ్‌ హీరోలు నాగచైతన్య మరియు అఖిల్ లతో విడి విడిగా నటిస్తున్న విషయం తెల్సిందే. నాగ చైతన్యతో ‘సవ్యసాచి’ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నటిస్తోంది. మరో వైపు బాలీవుడ్లో కూడా ఈ అమ్మడు నటిస్తూనే మోడలింగ్ కూడా చేస్తూ ఉంటుంది.

6 28

తాజాగా జిక్యూ నిర్వహించిన ఒక అవార్డు వేడుకలో నిధి అగర్వాల్ పాల్గొంది. రెడ్ కార్పెట్పై వాక్ చేసిన ఈ అమ్మడు తన అందాలు ఆరబోయడంతో కెమెరామెన్లు తమ కెమెరాలకు పని చెప్పారు. హిందీలో కేవలం ఒక్క చిత్రంలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ భామ తెలుగులో ఒకేసారి రెండు సినిమాలో అదీ కాకుండా అక్కినేని హీరోల సరసన నటించే అవకాశం రావడం చాలా అరుదైన విషయంగా చెప్పుకోవాలి. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu