HomeTelugu News2020లో పెళ్లి పీటలెక్కబోతున్న నితిన్‌..!

2020లో పెళ్లి పీటలెక్కబోతున్న నితిన్‌..!

13a
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో నితిన్ ఒకడు. పెళ్లి మాట వస్తే.. అప్పుడూ ఇప్పుడూ అంటున్నారు కానీ పెళ్లెప్పుడో మాత్రం చెప్పడం లేదు. ఆ మధ్య శ్రీనివాస కళ్యాణం సినిమా చేసినపుడు తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు నితిన్. కానీ ఇప్పటి వరకు పెళ్లి తప్ప అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు. తాజాగా నితిన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడని.. ఇంట్లో సంబంధం కూడా ఖాయం చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా కొన్ని రోజులుగా నితిన్‌ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని.. ఇంట్లో కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. వధువు కూడా అచ్చ తెలుగుమ్మాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అన్నీ కుదిర్తే నితిన్ పెళ్లి ఏప్రిల్ 2020లో జరగనుందని ప్రచారం జరుగుతుంది. నితిన్ ప్రేమించిన అమ్మాయికి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. కానీ దీనిపై మాత్రం ఎవరూ ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది.. కెరీర్ ఏంటి.. ఇలాంటి విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పెళ్లంటే దూరంగా పారిపోయే బ్రహ్మచారి పాత్రలో నటిస్తున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దీనికి దర్శకుడు. ఈ చిత్రంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చదరంగం.. వెంకీ అట్లూరీతో రంగ్ దే సినిమాలకు కమిటయ్యాడు నితిన్. ఏదేమైనా కూడా వరస సినిమాలతో పాటు లైఫ్‌లో కూడా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు నితిన్.

13 5

Recent Articles English

Gallery

Recent Articles Telugu