HomeTelugu Newsఆకట్టుకుంటున్న నితిన్‌ బర్త్‌డే గిఫ్ట్‌..

ఆకట్టుకుంటున్న నితిన్‌ బర్త్‌డే గిఫ్ట్‌..

10 24
యంగ్‌ హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చారు. సోమవారం ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని ‘రంగ్‌దే: గివ్‌ మి సమ్‌ లవ్‌’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరోయిన్‌ కీర్తి సురేశ్‌, నితిన్‌ను చూపించారు. వారిద్దరూ అను, అర్జున్‌ పాత్రల్ని పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచార చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

‘రంగ్‌దే’ సినిమాకు ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మరోపక్క ఆయన హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ నటించబోతున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu