Homeతెలుగు వెర్షన్నిజంగా ఆస్కార్ స్థాయి నటుడు మన 'అవినాష్ రెడ్డే' !

నిజంగా ఆస్కార్ స్థాయి నటుడు మన ‘అవినాష్ రెడ్డే’ !

Our Avinash Redde is truly an Oscar level actor

ఓరి నీయమ్మ బడవా… ఎందయ్యా ఇది.. ఇదేందయ్యా యిది అనేలా ఉంది అవినాష్ రెడ్డి నటన. అవినాష్ రెడ్డి నటన చూసి మహా నటులకు సైతం వణుకు పుడుతుంది ఏమో. అసలు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును పట్టుకెళ్లి ఆ ‘బ్రెన్డన్ ఫ్రాజర్’ కి ఇచ్చారు గానీ, నిజంగా ఆస్కార్ స్థాయి నటుడు మాత్రం మన అవినాష్ రెడ్డే. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిది ముఖ్య పాత్ర అని తెలిసి కూడా.. ఇంకా మన చట్టాలు అతన్ని ఏమీ చేయలేకపోతున్నాయి అంటే.. న్యాయ వ్యవస్థ పై నమ్మకం పోతుంది. ఈ విషయంలో కచ్చితంగా పోలీస్ వ్యవస్థ సిగ్గుతో చితికిపోవాలి.

పైగా అవినాష్ రెడ్డి మీడియా ముఖంగా ఎదురుదాడి మొద‌లుపెట్టడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కేసులో సీబీఐ విచార‌ణ‌లో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సాక్ష్యాలు కూడా తేలాయి. రుజువు కూడా అయ్యింది. కానీ, విచార‌ణ అనంత‌రం సీబీఐ అధికారులు అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు. పైగా అవినాష్ రెడ్డి బయటకు వచ్చి నేరుగా మీడియా ముందుకు వచ్చి సీబీఐ విచార‌ణ సంస్థ తీరును త‌ప్పుప‌ట్టారు. త‌నను విచారిస్తున్న వైనం చాలా అన్యాయం అన్నట్టు చెప్పుకొచ్చారు. మరి సీబీఐ అధికారులు ఈ మహా నటుడి కామెంట్లు ప‌ట్టించుకున్నారో లేదో వారికే తెలియాలి.

ఒక ల్యాప్ టాప్ ను తన ముందు పెడుతున్నార‌ని, పలు ప్రశ్నలకు బలవంతంగా తన చేత సమాధానాలు చెప్పిస్తున్నారని అవినాష్ రెడ్డి వారు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ కేసులో వైఎస్ సునీత‌కు సీబీఐ డైరెక్టుగా లీకులు ఇస్తోంద‌ని కూడా అవినాష్ రెడ్డి చెబుతున్నాడు. మొత్తానికి సీబీఐ విచార‌ణ తీరుపై క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి చాలా అడ్డుగోలుగా మాట్లాడాడు. అయినా, అతగాడిన్ని ఇప్పటి వరకూ ఎవరూ ఏం చేయలేక పోవడం నిజంగా దురదృష్టకరం.

అసలు, వివేకానంద‌రెడ్డి హ‌త్య జరగడం అన్యాయం అయితే, ఆ హత్య జరిగిన తీరు చాలా దారుణం. అంత భయంకరమైన హత్య జరిగితే.. ఎందుకు వెంటనే పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. సరే.. ఇన్నేళ్లకు నిందితుడు దొరికాడు అనుకుంటే.. అతగాడు ఇష్టం వచ్చినట్టు ఏకంగా సీబీఐ పైనే ఆరోపణలు చేస్తున్నాడు. మరి ఈ దేశంలో రాజకీయ నాయకులకు, వారి మనుషులకు శిక్షలు పడవా ?, ప్రభుత్వం ఏదైనా.. వాళ్ళు తమ తప్పులు నుంచి చాలా సులభంగా తప్పించుకుంన్నారు.

చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నప్పుడు.. మరి ఆ చట్టాలను ఎందుకు అప్ డేట్ చేయకూడదు!. అసలు వివేకానంద‌రెడ్డి లాంటి బలమైన నేతనే అంత దారుణంగా చంపి.. దర్జాగా తిరుగుతున్నప్పుడు.. ఇక ఎల్లయ్యనో పుల్లయ్యనో చంపేసి ఎందుకు దర్జాగా తిరగలేం అని నేరస్థులు అంతా భావిస్తే.. ఏమిటి సామాన్యుల పరిస్థితి ?. న్యాయ – పోలీస్ వ్యవస్థలు ఈ పాయింట్ ను గమనించగలరు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu