HomeTelugu Big Storiesఇండియన్‌ ఐడల్‌-12 విజేతగా పవన్‌దీప్‌

ఇండియన్‌ ఐడల్‌-12 విజేతగా పవన్‌దీప్‌

Pawandeep rajan wins indianఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచాడు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్‌, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్‌ దనిష్‌, ఐదో స్థానంలో నిహల్‌, మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. ఎన్నో ఆశలతో ఫైనల్‌ పోరుకు చేరిన షణ్ముఖప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. 12 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది. గ్రాండ్‌ ఫినాలే ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్‌ షో అర్ధరాత్రి వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు తిలకించి ఉర్రూతలూగారు. మొదటినుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి ఫైనల్‌ బరిలో మన తెలుగుతేజం షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌, నిహల్‌, సేలీ కంబ్లే, మహ్మద్‌ దనిష్‌ నిలిచారు. ఈ ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారని అందరూ ఊపిరిబిగబట్టుకొని చూశారు. చివరగా ఫైనల్‌ విజేతగా పవన్‌దీప్‌ను ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.

ఇండియన్‌ ఐడల్‌ 12 సీజన్‌కు ఆదిత్య నారాయణ్‌ హోస్ట్‌గా, హిమేశ్‌ రేష్మియా, అను మాలిక్‌, సోను కక్కర్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గ్రాండ్‌ ఫినాలేకు జావెద్‌ అలీ, సుఖ్విందర్‌ సింగ్‌, రాఘవ్‌ సచార్‌, మికా సింగ్‌, సాధన సర్గమ్‌, అన్ను కపూర్‌, షేర్షా జంట సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్‌ నారాయణ్‌, అల్కా యజ్ఞిక్‌, వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌ ఫేం గ్రేట్‌ కాళీ తదితరులు అతిథులుగా విచ్చేశారు. పలువురు గాయకులు పాటలతో ఫైనల్‌పోరులో ఉత్సాహం నింపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu