HomeTelugu Big Storiesప్రభాస్‌ సర్జరీ తరువాతే.. సలార్‌ షూటింగ్‌!

ప్రభాస్‌ సర్జరీ తరువాతే.. సలార్‌ షూటింగ్‌!

Prabhas salaar movie shooti

పాన్‌ ఇండియా ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఇంతవరకూ 50 శాతానికి లోపే చిత్రీకరణను జరుపుకుంది. కోల్ మాఫియా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ‘రాధే శ్యామ్’ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ బిజీగా ఉండటం వలన, ఈ సినిమా షూటింగును ఆపడం జరిగిందని అనుకున్నారు.

ఇక ‘రాధే శ్యామ్’ హడావిడి తగ్గింది కనుక, ‘సలార్’ తదుపరి షెడ్యూల్ మొదలవుతుందని భావించారు. ఈ క్రమంలో ప్రభాస్ సర్జరీ విషయం తెరపైకి వచ్చింది. విదేశాల్లో ప్రభాస్ సర్జరీ జరగనుందని అంటున్నారు. ఈ సర్జరీ తరువాత ప్రభాస్ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారట. ఆ తరువాతనే తిరిగి ఆయన ‘సలార్’ షూటింగులో పాల్గొంటాడని చెబుతున్నారు.

ఈ కారణంగానే ప్రస్తుతానికి ‘సలార్’ షూటింగును ఆపేయడం జరిగిందని అంటున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ చేస్తున్న ‘ప్రాజెక్టు K’ కూడా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.

మంచు మనోజ్‌ కారుకు జరిమానా!

Recent Articles English

Gallery

Recent Articles Telugu