HomeTelugu Newsరజనీ కొత్త సినిమా 'అన్నాత్త' .!

రజనీ కొత్త సినిమా ‘అన్నాత్త’ .!

3 24
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. కోలీవుడ్‌లో ‘దర్బార్’ వసూళ్ల జోరును కొనసాగిస్తూనే ఉండగా, మరో వైపున తదుపరి సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నారు. ఆయన 168వ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అజిత్ కి వరుస విజయాలు ఇచ్చిన శివపై రజనీ ఫ్యాన్స్‌ గట్టి నమ్మకాన్నే పెట్టుకున్నారు.

ఈ సినిమాకి ‘అన్నాత్త’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించవలసి వుంది. రజనీకాంత్ సరసన ఖుష్బూ .. మీనా నటిస్తుండగా, మరో కీలకమైన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుందని సమాచారం. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారనీ, కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటి ఆయన ఈ సినిమాలో చేస్తున్నారని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu