HomeTelugu Big Storiesక్లీంకార ప్రత్యేక వీడియో విడుదల చేసిన రామ్‌చరణ్‌

క్లీంకార ప్రత్యేక వీడియో విడుదల చేసిన రామ్‌చరణ్‌

ram charan releases klin ka

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 20న రాంచరణ్-ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకార కు మెగాఫ్యామిలీ ఘనంగా స్వాగతం పలికింది. ఈ రోజుతో మెగాప్రిన్స్‌ పుట్టి నెల రోజులవుతుంది. మరోవైపు గురువారం రోజే ఉపాసన పుట్టినరోజు కావడం మెగాఫ్యామిలీ చాలా ప్రత్యేకమైన సందర్భమనే చెప్పాలి.

ఈ రెండు ప్రత్యేక సందర్బాలను పురస్కరించుకొని క్లీంకార ఆగమనానికి సంబంధించిన వీడియోను హార్ట్‌ టచింగ్ వీడియోను రామ్ చరణ్ విడుదల చేశారు. క్లీంకార వన్‌ మంత్‌ బర్త్‌ యానివర్సరీ వీడియోను పాపులర్‌ ఫిల్మ్‌ మేకర్‌ జోసెఫ్ ప్రతనిక్‌ డైరెక్ట్‌ చేసి నిర్మించడం విశేషం. ఈ వీడియోలో చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన తల్లిదండ్రులు శోభ-అనిల్ కామినేని ఉన్నారు.

హ్యాపీమూడ్‌లో ఉన్న కుటుంబసభ్యుల ఆనందోత్సాహాలను వీడియోలో చూడొచ్చు.ఈ వీడియోలో ఉపాసన గర్భవతి అయినప్పటి నుండి.. పాపకు నామకారణం చేసే వరకు జర్నీ మొత్తం వీడియోలో చూపించారు. ఎన్నో ఎమోషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu