HomeTelugu News10 రోజుల్లో రామ్‌చరణ్‌ కలెక్షన్స్

10 రోజుల్లో రామ్‌చరణ్‌ కలెక్షన్స్

16 1

రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన “వినయ విధేయ రామ” సినిమా పాజిటివ్ బజ్ తో రిలీజైనా.. ఆ తరువాత ఆ స్థాయి పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. భారీ హిట్ అవుతుంది అనుకుంటే.. టాక్ వ్యతిరేకంగా రావడంతో.. పరాజయం పాలైంది. కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా పర్వాలేదనిపించింది. పదిరోజుల్లో ఈ సినిమా రూ. 60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ. 30 కోట్లు రావాలి. ఇది సాధ్యమయ్యే పనికాదు. లాంగ్ రన్ లో మరో మూడు నాలుగు కోట్లు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పదిరోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాం : రూ.12.50 కోట్లు, సీడెడ్: రూ. 11.54 కోట్లు, ఉత్తరాంధ్ర: రూ. 8.06 కోట్లు, కృష్ణా: రూ. 3.55 కోట్లు, గుంటూరు:రూ. 6.27 కోట్లు, ఈస్ట్ : రూ.5.22 కోట్లు, వెస్ట్: రూ.4.26 కోట్లు, నెల్లూరు: రూ.2.76 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం : రూ. 54.16 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.5.36 కోట్లు, ఓవర్సీస్: రూ.1.43 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ (షేర్): రూ. 60.95 కోట్లు

Recent Articles English

Gallery

Recent Articles Telugu