HomeTelugu Big Storiesరానా-మిహికాల నిశ్చితార్ధం ఫొటోలు.. వైరల్

రానా-మిహికాల నిశ్చితార్ధం ఫొటోలు.. వైరల్

3 20టాలీవుడ్ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి ఇంట త్వరలో పెళ్లి బజాలు మోగబోతున్నాయి. దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు హీరో రానా,మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ‘ఇక అధికారికంగా’ అంటూ ఫోటోస్‌కు రానా క్యాప్షన్‌ పెట్టడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. హీరో రానా, మిహికా బజాజ్ లు కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంటకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దగ్గుబాటి అభిమానులు కూడా రానా, మిహీకాల ఫోటోలని చూసి ఫిదా అయ్యారు. తాజాగా రానా ఈ అమ్మాయిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!