HomeTelugu Big Storiesఅంటే సుందరానికీ: థర్డ్‌ సింగిల్‌ విడుదల

అంటే సుందరానికీ: థర్డ్‌ సింగిల్‌ విడుదల

Rango rango lyrical song fr

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకి … వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

థర్డ్‌​ సింగిల్‌ పేరుతో రిలీజ్‌ చేశారు. ‘అనుకుందోటి.. అయిందోటి.. రంగో రంగా’ అంటూ సాగే ఈ పాటకు భరద్వాజ్‌ పాత్రుడు సాహిత్యం అందించగా.. కారుణ్య ఆలిపించాడు. ఇక ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతాన్నిఅందించాడు. ఈ సినిమాలో నటుడు నరేశ్‌, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూన్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాని ఈ సినిమాతో పాటు ‘దసరా’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu