HomeTelugu Big Storiesరౌడీ బాయ్స్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన ఎన్టీఆర్‌

రౌడీ బాయ్స్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన ఎన్టీఆర్‌

Rowdy Boys Trailer

ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్‌లుగా శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్‌హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించారు. ట్రైలర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఎన్టీఆర్, ట్రైలర్ చూస్తుంటే హిట్ ఖాయమనిపిస్తోందని అన్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, దర్శకుడు శ్రీహర్ష, హీరోయిన్ అనుపమ, ఇతర చిత్రబృందానికి ఎన్టీఆర్ గుడ్ లక్ చెప్పారు.

‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. కాలేజి నేపథ్యంలో యూత్ ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu