HomeTelugu Newsహిందీలో రూ.153 కోట్లు రాబట్టిన సాహో

హిందీలో రూ.153 కోట్లు రాబట్టిన సాహో

14 7

ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 424 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే హిందీలో ఈ చిత్రం రూ.153 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళు సాధించిన‌ట్టు పోస్టర్ ద్వారా ప్ర‌క‌టించారు‌. అత్యున్నత సాంకేతిక నిపుణులతో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అలరించ‌క‌పోయిన హిందీలో మాత్రం హ‌వా చూపిస్తోంది. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్‌కి నేష‌న‌ల్ స్టార్‌డం రాగా, ఈ మూవీతో మ‌రింత పెరుగుతుంద‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన సాహో చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌గా, బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. దాదాపు రూ. 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సాహో చిత్రం రానున్న రోజుల‌లో రూ. 500 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు అంచనా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu