HomeTelugu Big Storiesరౌడీ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌!

రౌడీ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌!

 

Samantha special song liger

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకుల తరువాత బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది సమంత. మరో పక్క ‘పుష్ప’ లో ‘ఊ అంటావా మావా ఉఊ అంటావా మావ’ స్పెషల్‌ సాంగ్‌ చేసి ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు ఆ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. తాజాగా సమంత మరో స్పెషల్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. దాని కోసం పూరీ జగన్నాథ్‌ టీమ్‌ సమంతను సంప్రదించినట్లు సమాచారం.

‘ఊ అంటావా మావా ఉఊ అంటావా మావ’ సాంగ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో.. తమ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ కూడా సామ్‌ చేస్తేనే బాగుంటుందని పూరీ జగన్నాథ్‌ టీమ్‌ భావిస్తోందట. అందుకే ఆమెను సంప్రదించి స్పెషల్‌ సాంగ్‌ గురించి చర్చించారట. విజయ దేవరకొండ సైతం.. సామ్‌ అయితేనే బాగుంటుదని భావిస్తున్నారట. ఆమెతో తనకున్న చనువుతో ఈ విషయం చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడట. మరి నిజంగానే సమంత మరో స్పెషల్‌ సాంగ్‌కి ఒప్పుకుందా? తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu