HomeTelugu Big Storiesషూటింగ్ లో ప్రమాదానికి గురైన షారుఖ్ ఖాన్

షూటింగ్ లో ప్రమాదానికి గురైన షారుఖ్ ఖాన్

shahrukh khan met with acci

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డారు. ఆయన ముక్కుకు బలమైన దెబ్బ తగిలింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముక్కు నుంచి బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ముక్కుకు సర్జరీని నిర్వహించినట్టు సమాచారం. ఇప్పుడు షారుఖ్ ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. సర్జరీ తర్వాత షారుఖ్ ముక్కుకు బ్యాండేజ్ తో కనిపించారు. ప్రమాదం నేపథ్యంలో ఆయన ముంబైలోని తన నివాసం మన్నత్ కు చేరుకున్నారు.

ఇటీవలే ‘పఠాన్’ సినిమా సూపర్‌ హిట్‌ కొట్టి.. వెయ్యి కోట్ల వసూళ్లు దక్కించుకున్నాడు. ప్రస్తుతం డంకీ సినిమా చేస్తున్నాడు. ఇక ఆయన నటించిన జవాన్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా పై మంచి హైప్స్‌ ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu