HomeTelugu Big StoriesShaitaan Trailer: జ్యోతిక కూతుర్ని అడ్డుపెట్టుకుని విధ్వంసం సృష్టించిన మాధవన్‌

Shaitaan Trailer: జ్యోతిక కూతుర్ని అడ్డుపెట్టుకుని విధ్వంసం సృష్టించిన మాధవన్‌

 

Shaitaan TrailerShaitaan Trailer: బాలీవుడ్ న‌టుడు అజయ్ దేవగన్, జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్’. వికాస్ బెహల్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆర్ మాధవన్ నటిస్తున్నాడు. మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ఈ సినిమా మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు.

ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా సినిమా నుంచి చిత్ర‌యూనిట్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే.. వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన అజయ్ దేవగన్ కుటుంబం అక్క‌డ ఒక అపరిచిత (మాధవన్) వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది.

ఒక అర్జెంట్ ఫోన్ కాల్ చేసుకోవటానికి అజయ్, జ్యోతికల ఇంట్లోకి అడుగు పెట్టిన మాధవన్.. ఊహించని రీతిలో వారి కూతురి పై వశీకరణ ప్రయోగం చేస్తాడు. ఆ తరువాత మాధవన్ ఏం చెప్తే అది ఆ అమ్మాయి చేస్తుంది. నేనెవరో.. అసలు ఏం చేయగలనో మీకు తెలుసా అంటూ మాధవన్ వార్నింగ్ ఇవ్వటంతో ట్రైలర్ ముగుస్తుంది. తన అద్భుతమైన నటనతో ట్రైలర్లో మాధవన్ భయపెట్టేశారు. ఈ ట్రైలర్‌ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగింది.

జియో స్టూడియోస్‌‌ సమర్పణలో అజయ్ దేవగన్‌‌, జ్యోతి దేశ్‌‌పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాను సంయ‌క్తంగా నిర్మిస్తున్నారు. గుజరాతీ హారర్ థ్రిల్లర్ ‘వష్’ సినిమాకు రీమేక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu