శంకర్‌తో ప్రభాస్‌ మూవీ?

ఇండియాలో టాప్ దర్శకుల్లో శంకర్ ఒకరు. శంకర్ కెరీర్ మొదట్లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు. గత కొంతకాలంగా హిట్స్ కోసం ఇబ్బందులు పడుతున్నాడు జగన్. ప్రస్తుతం శంకర్… కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత శంకర్ ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయి.

బాహుబలి హీరో ప్రభాస్ తో శంకర్ ఓ సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చేస్తున్నారు. దీంతో పాటు జాన్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ప్రభాస్ కొంత సమయం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తారట.