జగన్ రెడ్డికి శిక్ష పడాలా ?, ఐతే ఇలా చేయండి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలు కి పంపిన కేసులు ఏమైపోయాయి ?, అన్ని కేసుల్లో తప్పు జరిగింది అని రుజువు అయినా, అసలు జగన్ రెడ్డి జైలు నుంచి ఎలా విడుదల అయ్యాడు ?. ఇవన్నీ సగటు ఆంధ్రుడి ప్రశ్నలు. కారణాలేమిటి అనేది చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. కోర్టులు, తీర్పులు సామాన్యులకు అర్థం కానివి, అర్ధం అయినా, వారికీ అందుబాటులో లేనివి. అయినా జగన్ రెడ్డి కేసుల గురించి ఒక్క మాటలో చెప్పుకుంటే.. మన దేశంలో డబ్బు ఉన్న వాళ్లకు చట్టాలు చుట్టాలు.

కానీ, తప్పు చేసిన వారికి శిక్ష వేయడానికి ఆలస్యం చెస్తే అన్యాయం చేసినట్లు గానే భావించాలి. కాబట్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ జైలుకి ఎప్పుడు వెళ్తాడు అని అడగొద్దు. ఆయనగారి పై ఉన్న కేసుల వివరాలు గురించి అసలే వద్దు. శిక్షలు పడని కేసులు ఉంటే ఎంత ?, లేకపోతే ఎంత ?, ఒకవేళ శిక్ష పడినా జైలు నుంచి ఎలాగైనా జగన్ రెడ్డి మళ్లీ విడుదల అవుతాడు. అసలు అంత పెద్ద ఆర్థిక గజ దొంగను సీఎం చేసినా ఆంధ్రా ప్రజలను చూస్తే.. రక్తం మరుగుతుంది అంటూ ఆ మధ్య రేణుకా చౌదరి అన్నట్టు గుర్తు.

రేణుకా చౌదరి అన్నట్టుగానే నేడు ఆంధ్రాలో జరుగుతున్న తప్పులు అన్నిటికీ కారణం.. ఆంధ్ర ప్రజలే. ఇక మెయిన్ టాపిక్ కి వస్తే.. జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సిన కేసులు పరిస్థితి ఏమిటి ?. ఇంకా కోర్టులోనే ఉన్నాయి. ఎప్పటికీ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కారణాలు, వివరాలు ఎలా వున్నా మహాశయుల్లారా చట్టం తన పని తాను చేసుకు పోతాది అనుకోవడం తప్ప, ప్రస్తుత సగటు ఆంధ్రుడు ఏమీ చేయలేడు. కానీ, ఒక్కటి చేస్తే.. ఆ కోర్టుల్లోని కేసులన్నీటిలోనూ కదలికలు వస్తాయి.

ఆ ఒక్కటి ఏమిటో తెలుసా ?, వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదు. సాధారణంగా జీవిస్తూ బతికే జనాలు మళ్లీ అంతా మరచిపోకుండా… ఇప్పటి ఆంధ్ర పరిస్థితిని గుర్తు పెట్టుకుని.. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఓటు వేయకుండా, వేసే వారికి కూడా అడ్డు తగిలి, వారి చేత కూడా వేయించకుండా చేయండి. అప్పుడు జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళవలిసిన కేసులు మళ్లీ బలపడతాయి. జగన్ రెడ్డి ఎకౌంట్ ను క్లోజ్ చేస్తాయి. కాబట్టి.. ఆంధ్రుల్లారా ఇకనైనా జాగ్రత్త పడండి.

CLICK HERE!! For the aha Latest Updates