HomeTelugu News'సీత' ఫస్ట్‌లుక్‌

‘సీత’ ఫస్ట్‌లుక్‌

2 25యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సీత’. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బెల్లంకొండ ఆనందంతో అరుస్తుంటే.. ఆయన్ను కాజల్‌ షాకింగ్‌గా చూస్తున్నారు. ఈ పోస్టర్‌ను కాజల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘సీత, రామతో కలిసి పిచ్చి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి’ అని పోస్ట్‌ చేశారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని కాజల్‌ శుక్రవారం అన్నారు. చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించాలని చాలా ఉత్సుకతగా ఉన్నట్లు తెలిపారు.

‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu