HomeTelugu Big Storiesఎన్టీఆర్‌ శతజయంతి: తారక్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

ఎన్టీఆర్‌ శతజయంతి: తారక్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Tollywood celebrities remem
నేడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి. ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి’ అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

ఇక రామరావు జయంతి సందర్భంగా తాతను స్మరించుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎన్టీఆర్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ పోస్టులు పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu