HomeTelugu Big Storiesఆహా: ఫ్యామిలీ గేమ్ షోలో యాంకర్‌గా విశ్వక్‌సేన్‌

ఆహా: ఫ్యామిలీ గేమ్ షోలో యాంకర్‌గా విశ్వక్‌సేన్‌

Vishvak Sen as anchor in

విశ్వక్‌సేన్ యాంకర్‌గా మారబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ఆహా ఓటీటీ రివీల్ చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా మరో ఇంట్రెస్టింగ్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షో పేరు ఫ్యామిలీ ధమాకా. మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో స్ట్రీమింగ్ తేదీని సోమవారం (ఆగస్ట్ 28) ఆహా ఓటీటీ రివీల్ చేసింది. ఈ సందర్భంగా ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ షో సెప్టెంబర్ 8 నుంచి స్ట్రీమ్ అవనుంది.

ఫ్యామిలీ ధమాకా షో ప్రారంభం కానున్నట్లు కొన్ని రోజుల కిందట ఓ పోస్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. మొదటిసారిగా విశ్వక్ సేన్ హోస్ట్ గా వ్యవహరించనున్నడంతో ఈ షోకి విపరీతమైన బజ్ క్రియేటైంది. దీంతో ఈ షోపై ఆడియన్స్‌ చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రోమోలో కొన్ని ఫ్యామిలీస్ రావడం, వాళ్లను తనదైన స్టైల్లో ఫన్నీగా కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా విశ్వక్ సరదాగా షోని నడిపించేశాడు. తొలిసారి ఇలాంటి షోకి హోస్ట్ చేస్తున్నా.. విశ్వక్ అవలీలగా యాంకరింగ్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

https://www.instagram.com/reel/CwfDPEnpf_t/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu